Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

రఘురామ కేసులో కీలక పరిణామం:సునీల్ నాయక్ కు మరో రిలీఫ్..!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju)ను గత వైసీపీ ప్రభుత్వంలో కస్టడీలో హింసించిన కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్, బీహార్ ఐజీ సునీల్ నాయక్ ను గుంటూరు పోలీసులు తాజాగా అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు. అరెస్టు చేశాక అక్కడి స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టును ఆశ్రయించి ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ట్విస్ట్ ఎదురైంది.

గుంటూరు కోర్టు న్యాయమూర్తి స్రవంతి ముందు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ తర్వాత సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే బీహార్ లోని పట్నా కోర్టు ఆయన్ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఊరటనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి.. పోలీసుల్ని ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. దీనికి వారు తమకు కూడా ఈ విషయం తెలియదని చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ పై జారీ చేసేందుకు సిద్దమైన నాన్ బెయిలబుల్ వారెంట్ ను నిలిపేస్తూ గుంటూరు కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పట్నాలో సునీల్ నాయక్ నివాసానికి వెళ్లి దౌర్జన్యంగా ఆయన్ను అరెస్టు చేసారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను మరోసారి అదుపులోకి తీసుకోకుండా స్థానిక కోర్టు రక్షణ కల్పించింది. సునీల్ నాయక్ ఏపీ పోలీసుల విచారణకు హాజరవుతారని అక్కడి కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో విచారణ వాయిదా పడింది. మొత్తం మీద సునీల్ నాయక్ కు ఏపీలోనూ తాత్కాలిక లభించినట్లయింది.

Related posts

పోలవరంపై సుప్రీంకోర్టు షాక్..!!

M HANUMATH PRASAD

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఆధార్ తరహాలో

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD

అమరావతి సక్సెస్ కాదు-మొండిగా ముందుకెళ్లొద్దు-బాబుకు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా..!

M HANUMATH PRASAD

మంగుళూరులో హిందూ కార్యకర్త దారుణ హత్య

మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీమ్ కోర్టు బిగ్ రిలీఫ్

M HANUMATH PRASAD