పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, ఆగస్టు 14:
జనసేన పార్టీ కుటుంబంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గురువారం పెంటపాడు యలమపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి శ్రీనివాస్, దాసరి కోట సత్యం, సత్యనారాయణ రెడ్డి తదితరులు 50 మందితో కలిసి జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుల్ల బాబి అధ్యక్షతన బొలిశెట్టి శ్రీనివాస్ కొత్తగా చేరిన వారికి జనసేన కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తరఫున స్వాగతం. కష్టసుఖాల్లో జనసైనికుల పక్కనే ఉంటాం. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలు ప్రజల బాగోగుల దిశగా సాగాలి” అన్నారు. ప్రధాని మోడీ సారధ్యంలో గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని, దానికి సహకరించిన ప్రతి జనసైనికుడు గర్వించాలన్నారు.
వైసిపి పాలనలో భయంతో తిరిగిన గ్రామాలు నేడు స్వేచ్ఛగా మారాయని, సైకో రాజకీయాలతో గోతులు తవ్వుకున్న వైసిపి ప్రభుత్వం పతనమైందని వ్యాఖ్యానించారు. ఆకలి కేకలు వినిపించే చోట జనసైనికులు స్వచ్ఛందంగా సేవ చేస్తారని, ఆ కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్ల బాబి, తోట రాజా, మైలవరపు పెదబాబు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొనకళ్ళ హరినాథ్, చామన సురేష్, కృష్ణ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
