పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ
లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం:
పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు చింతకాయల బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ –
కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.
కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలి అని కోరారు.
అంగన్వాడీ ఉద్యోగినులకు ఇచ్చిన సెల్ ఫోన్లు మార్పు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మహాసభలో రైతు నాయకుడు చిర్ల పుల్లారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
