టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం – డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో, ఆగస్టు 30, 2025 (శనివారం) సాయంత్రం 5 గంటలకు జరిగిన డాక్టరేట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో, తాళ్లూరి వెంకట రామకృష్ణ గారికి గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం నివాసి అయిన ఆయన ప్రస్తుతం పెంటపాడు మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖాధికారిగా విద్యారంగంలో చేసిన విశేష సేవలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో ఆయన చూపిన కృషిని గుర్తించి, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ మరియు ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ & రీసెర్చ్ స్పూర్తి అకాడమీ సంయుక్తంగా ఈ అవార్డు ప్రదానం చేశారు.
“ఈ గౌరవ డాక్టరేట్ నాకు మరింత బాధ్యతలు పెంచింది. భవిష్యత్తులో విద్యారంగం మరియు సామాజిక సేవల్లో మరింత కృషి చేస్తాను” అని అవార్డు గ్రహీత టి.వి. రామకృష్ణ గారు తెలిపారు.
