తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి
సెప్టెంబర్ 1: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడిన ఆమె, రైతుల నుండి సాధ్యమైనంత మంచి ధరకు ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను ఆదుకోవడం వ్యాపారుల కనీస బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ నాగరాణి, కర్నూలు–నంద్యాల జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ఉల్లిపాయ పంట తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ప్రజలు ఆరుదల ఉల్లిపాయలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నిల్వ చేయలేని ఉల్లిపాయలను వినియోగించడం ద్వారా అక్కడి రైతాంగానికి మద్దతు ఇవ్వవచ్చని ఆమె పిలుపునిచ్చారు.
ఉల్లి రైతుల పరిస్థితిని చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.
అనంతరం సవిత్రపేటలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ వెంట ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తహశీల్దార్ ఎం. సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తదితరులు ఉన్నారు.
