తాడేపల్లిగూడెం
కుంచనపల్లి ఆటో నగర్ సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వరి టెంపుల్ ప్రార్థన మందిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ మతాన్ని అనుసరించినా మనసులోని మంచితనం, నైతికత, పరమత సహనం ముఖ్యమని అన్నారు.
ప్రభువు బోధించిన ప్రేమ, క్షమ, సత్యనిష్ఠ వంటి విలువలను జీవన శైలిలో అమలు చేస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన సూచించారు.
“పొరపాట్లు జరుగవచ్చు, కానీ వాటిని తెలుసుకుని సరిదిద్దుకునే స్వభావం ప్రతి వ్యక్తికి ఉండాలి. ప్రార్థన మందిరాలకు రావడం కేవలం ఆచారం కాదు, మన ఆలోచనల్లో మార్పు రావాలి” అని ఎమ్మెల్యే తెలిపారు.
కల్వరి టెంపుల్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు బ్రదర్ సతీష్ కుమార్, యేసయ్య దీవెనలతో ఊహించిన దానికంటే వేగంగా ప్రార్థనా మందిరం పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి విశ్వాసి ప్రేమ, దయ, క్షమతో జీవించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రవికుమార్, దైవజనులు అనిల్ కుమార్తో పాటు అనేక మంది విశ్వాసులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయాన్ని జిల్లా ప్రజలు సందర్శించి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు తెలియజేశారు.
