Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు

*రాష్ట్రంలో10 ఐఐటి, నీట్ కోచింగ్ అకాడమీలు ఏర్పాటు*

— కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు

— విజయవాడలో లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు
— పెద తాడేపల్లి గురుకులం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్
— రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అదనపు కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్

తాడేపల్లిగూడెం

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా జాతీయస్థాయిలో విద్యార్థులు సీట్లు సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 ఐఐటి, నీట్ అకాడమీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అదనపు కార్యదర్శి కె.సునీల్ రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం పెద తాడేపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అదనపు కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఎంపీసీ బైపీసీ చదివే విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ, నీట్ లాంటి వాటిలో సీట్లు సాధించేందుకు నైపుణ్యం గల అధ్యాపకులతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 నీట్ ఐఐటి సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా గురుకుల పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు విజయవాడలో విద్యార్థులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ ను నియమించామన్నారు, ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్విని చేసుకుని నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవాలన్నారు నేటి పోటీ ప్రపంచంలో విద్యతోపాటు క్రీడలు సాంస్కృతిక, స్కౌట్ అండ్ గైడ్, ఎన్ సి సి లాంటి కార్యక్రమాల్లో రాణిస్తే ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన లభిస్తాయి అన్నారు ఇటీవల లక్నోలో జరిగిన స్కౌట్ అండ్ గైడ్స్ జంబోరి కార్యక్రమంలో 56 మంది విద్యార్థులకు పాల్గొని సర్టిఫికెట్లు సాధించడం అభినందనీయం అన్నారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల అడుగులు వేయాలన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు ప్రిన్సిపల్ రాజారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులలో నైపుణ్యం సాధించాలన్నారు ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలన్నారు పదో తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించమన్నారు ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషం అన్నారు అనంతరం అదనపు కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్ చేతుల మీదగా సర్టిఫికెట్లు అందజేశారు తల్లిదండ్రులకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ప్రకాష్,రవి జైన్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

Arnews Telugu

యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు

Arnews Telugu

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu