అమ్మ వారి దేవాలయాల అభివృద్ధికి కమిటీ ప్రజలందరూ సహకరించాలి… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం డిసెంబర్6:
విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలను భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు చూపారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం ఉదయం సత్యవతి నగర్ వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారి పై ఉన్న భక్తిని చాటి చెప్పేందుకు గత పది సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులు కాళ్ల గోపికృష్ణ, యాదల శివాజీ, బొర్రా మురళీధర్ తదితర సభ్యుల్ని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతలు మరియు భక్తుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆయన కోరారు.
