Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు.. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత తాను ఇచ్చిన రెండు పిల్లి పిల్లలకు సంబంధించి డబ్బు ఇవ్వమని షేక్ బాజీ.. పిల్లులను తీసుకున్న వ్యక్తిని అడిగాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇది కాస్త చినికి చినికి గాలి వానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో పిల్లులను తీసుకున్న ఎస్కే బాజీ కత్తితో.. షేక్ బాజీ ఇంటికి వెళ్లి బెదిరించాడు. ఈ ఘర్షణలో బాజీని పొట్టలో కత్తితో పొడిచాడు ఎస్కే బాజీ.. దీంతో అతనికి తీవ్ర గాయమైంది.. తీవ్ర రక్త స్రావంతో గాయపడిన షేక్ బాజీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదిలాఉంటే.. కత్తితో దాడి చేసిన బాజీ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి షేక్ బాజీ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Related posts

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

Arnews Telugu

ఆత్రేయపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు రికార్డు లేని 20 వాహనాలు స్వాధీనం – 20 లీటర్ల సారాతో మహిళ అరెస్ట్

Arnews Telugu

18ఏళ్ళ తర్వాత మహిళకు విముక్తి కల్పించి ఇండియాకి రప్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu