కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు.తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన తాడేపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయలు చెక్కులని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటి నిలిచే నాయకుడిగా బొలిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజల పాలిట అండగా నిలిచారని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సుమారు మూడు కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలో ప్రజలకు అందించాలని తెలిపారు.
