జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్ సుమారు 100 మందికి పైగా అనుచరులతో కలిసి నేడు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జన సేన తీర్థం పుచ్చుకున్నారు. వారిని శాసన సభ్యులు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి పాలనలో ఐదు సంవత్సరాల పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని, అటువంటి పార్టీని విడనాడి జనసేన పార్టీని ఎంచుకోవడం హర్షనీయం అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజలకు తీరని అన్యాయం చేసిన జగన్ కు ఎన్నికల ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పార్టీలో చేరిన క్రొత్త వారందరూ కుటుంబ సభ్యులుగా మెలగాలని వారందరినీ సీనియర్ నాయకులు గౌరవంగా ఆహ్వానించాలని కోరారు. నేటి రాజకీయాలకు తలొగ్గి తాను ఎవొక్కరి పైన కక్షపూరిత చర్యలు చేయలేదని అటువంటి వారిని తాను దరిచేరనీయనని అన్నారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిని ఏనాడు తాను కించపరచలేదని, ఇప్పటికైనా వారు బిద్ది తెచ్చుకుని ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాలను తన వద్ద ఉంచితే నియోజకవర్గ అభివృద్ధి చేసిన వారు అవుతారని అన్నారు.
