ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.
తాడేపల్లిగూడెం :
నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా మని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల ప్రజా పరిషత్తు నూతన అధ్యక్షురాలిగా కట్టుబోయిన వెంకటలక్ష్మి ఎన్నిక, ప్రమాణస్వీకారం పుల్లా బాబి అధ్యక్షతన గురువారం జరిగింది. అనంతరం జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు, ఎం.పి.టి.సి., జడ్పీటీసీ సభ్యులు, అధికారులు ఆందరూ అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ద వహించి పనులు వేగవతంగా పూర్తి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పరిపాలనను వేగవంతం చేశారని ఈ వేగాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని ఆయన కోరారు. డి డి ఓ ప్రభాకర్ ఎన్నికల అధికారిగా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు.ఇప్పటివరకూ వైసిపి చేతిలో ఉన్న పెంటపాడు మండల ప్రజా పరిషత్తు ఈ ఎన్నిక తో జనసేన కు దక్కింది.కార్యక్రమంలో
కూటమి నాయకులు, ఈతకోట తాతాజీ,దాసరి
అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, బండారు వెంకటరావు, పాలూరి వెంకటేశ్వరరావు,జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, కసిరెడ్డి మధులత, కట్టుబోయిన కృష్ణ ప్రసాద్ ముత్యాల ఆంజనేయులు, పలు పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
