Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బ్రహ్మణి ఈ అవార్డును స్వీకరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ, ఈ గుర్తింపు దక్కడం పట్ల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకత్వంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “నాయకత్వం అంటే… శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువను సృష్టించడం, ఈ క్రమంలో ప్రజలను శక్తివంతం చేయడమే” అని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ‘బిజినెస్ టుడే’కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భారతదేశవ్యాప్తంగా మహిళా నేతలను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఎన్‌ఎస్‌ఈ ఇండియాలో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. నారా బ్రహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు, తన తండ్రి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టులో బోర్డు మెంబర్‌గా కూడా సేవలందిస్తున్నారు.

Related posts

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

Arnews Telugu

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

జగన్నాధపురంలో పాసుపుస్తకాలు – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

Arnews Telugu

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu