రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తన నివాసంలో కేకును కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మసీద్ సెంటర్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద బాలింతలకు, వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హాస్టల్, ప్రత్తిపాడు అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019లో నాటి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి 151 సీట్లతో పార్టీని జగన్ అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొన్నామన్నారు. ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి ప్రభుత్వ వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. 2029లో రానున్నది జగనన్న రాజ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్టా నాగరాజు, ముద్రగడ లలిత కుమారి, చామన సూర్యచందర్రావు, బొద్దాని శ్రీనివాస్, యూత్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్, జీవన్, ఆరమిల్లి రవి, రాజేష్, సారిపల్లి రమణ, వలీ, సురేష్, కళ్యాణ్, మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు
previous post
