రాష్ట్రం కూటమి పాలనలో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందని మాజీ ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి నాయకులు తోట గోపి నీ ఆదివారం ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. ముందుగా మాగంటి బాబు, కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లను గోపి తనయులు తోట రాజా శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తోట గోపి ఇద్దరు మంచి స్నేహితులని తమ కుటుంబం తరతరాల నుంచి రాజకీయాల్లో ఉన్న తాడేపల్లిగూడెంలో అత్యంత నమ్మకమైన రాజకీయ నాయకుల్లో తోట గోపి బొలిశెట్టి శ్రీనివాసులు మా కుటుంబ సభ్యులుగా కలిసిపోయారన్నారు. అలాంటి వారితో కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి నాయకులు తోట గోపి ఇద్దరు కలిసి నియోజకవర్గంలో కూటమి పటిష్టతకు కృషి చేస్తున్నారని అదేవిధంగా రాష్ట్రమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో అభివృద్ధిలో వేగంగా ముందుకు దూసుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఎంతో సౌమ్యంగా అందరినీ కలుపుకు వెళ్లే మనస్తత్వం ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండడం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని కితాబిచ్చారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పైబోయిన రఘు,పుల్లా బాబి. పాలూరి వెంకటేశ్వరరావు, నరిసే సోమేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, రామ్ లక్ష్మణ్, బుడ్డి సాయి బాబా, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సురేష్, గుండుమోగుల సురేష్, తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
