Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

రాత్రిపూట బయట తిరగవద్దు…బాలాపూర్ పోలీసులు హెచ్చరిక

అవసరం అయితే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, DCP మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ACP మహేశ్వరం జానకి రెడ్డి పర్యవేక్షణలో వరుస హత్యల నేపథ్యంలో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనుమానితులపై నిఘా ఉంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన వెల్లడించారు.ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల కదలికల పై నిఘా ఉంచాలి, వారు చెడు అలవాట్ల బారిన పడకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పిల్లలకు ఏమైనా counseling అవసరం అయితే లోకల్ పోలీసు స్టేషన్ లో సంప్రదించగలరని తెలిపారు.వ్యాపార సంస్థలు నిర్దేశించిన సమయంలో రాత్రి వేళల్లో షాపులు మూసివేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల కు సహకారం అందించాలని ఆయన సూచించారు

Related posts

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..!?

Arnews Telugu

ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

Arnews Telugu

సైబర్ మోసానికి బలైన మాజీ ఐపీఎస్… తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య.

Arnews Telugu

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu