సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి ఎంబీబీఎస్ విద్యార్థిని బి. లావణ్య (23) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామం. మృతురాలు గవర్నమెంట్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివి తదుపరి హైదరాబాద్ గచ్చిబౌలి లో గల గౌలిదొడ్డి క్యాంపస్ నందు ఇంటర్ పూర్తి చేసి మొదట ప్రయత్నంలోనే 2020లో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు ఎంబీబీఎస్‌లో చేరినది. ఆమె ట్రాక్ రికార్డ్ ప్రకారంగా చదువులో, ఆటలలో చురుకుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూలిపనిచేస్తూ జీవిస్తున్నారు. అక్క శిరీష హైదరాబాద్ సాఫ్ట్ వేర్ గా జాబ్ చేస్తుండగా లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. అదే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్‌గా డాక్టర్ జనరల్ మెడిసిన్ చదువుచున్న సికింద్రాబాద్ ఆల్వాలకు చెందిన ప్రణయ్ తేజ్‌తో గత సంవత్సరం జూలై నెలలో పరిచయం ఏర్పడి ప్రేమ సంబంధంగా మారింది, వివాహం చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగిన ప్రణయ్ తేజ్, అనంతరం కుల భేదం కారణంగా వివాహానికి నిరాకరించడంతో లావణ్య తీవ్ర మనస్తాపానికి గురై జనవరి 3న లావణ్య తీవ్ర మనోవేదనతో మెడికల్ కాలేజీ హోస్టల్ రూమ్ నందు గడ్డి నివారణకు వాడే పారాక్విట్ మందును సెలైన్ ఎక్కించే సూది ద్వారా ఇంజక్షన్ చేసుకోవడంతో అపస్మారక స్థితిలో ఉండగా తన రూం మేట్స్ గుర్తించి చికిత్స గురించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ జనవరి 4 నాడు తెల్లవారుజామున 01.00 గంటలకు నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిననది. అట్టి విషయమై మృతురాలు అక్క శిరీష ఫిర్యాదు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేయగా అట్టి కేసును దర్యాప్తు ను ప్రారంభించి నిందితుని ఆచూకీ గురించి సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు టీంగా ఏర్పాటు చేసి పంపించగా నిందితుడైన ప్రణయ్ తేజ్ పట్టుకోని రాగ విచారణ ముద్దాయి బి.సి కంసాలి కులానికి చెందిన వ్యక్తి కాగా మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందినందున సెక్షన్ 108, 69 బి.ఎన్.ఎస్ మరియు SC/ST చట్టం ప్రకారంగా అరెస్ట్ చేసి రిమాండ్ గురించి కోర్టుకు పంపించారు.
