జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహాయం.
తాడేపల్లిగూడెం :
జనసేన కార్యకర్త దూద్ భాషాకు శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు లక్ష రూపాయల ఆర్థిక సహకారం సోమవారం అందజేశారు. స్థానిక చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఉన్న తాజ్ స్టార్టర్స్ షాపు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన విషయం తెలియగానే వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు.ఎమ్మెల్యేతో పాటు బొలిశెట్టి సేవాసమితి ఆధ్వర్యంలో 25,000 వేల రూపాయలు, బిజెపి నాయకుడు నరిసే సోమేశ్వరరావు 25,000 వేల రూపాయలు మొత్తం 1,50,000 ఆర్థిక సహాయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో జన సైనికులు వర్తనపల్లి కాశి, పుల్ల బాబి, అడబాల రామారావు, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల నరసింహారావు, వాడపల్లి సుబ్బరాజు, అడబాల మురళి, గుండుమోగుల సురేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
