పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించవచ్చని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బహిరంగ మలమూత్ర విసర్జన మనేధం మరుగుదొడ్లను వాడదామని నినాదంతో గ్రామంలో పెద్దలు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపీడీవో వి చంద్రశేఖర్ గ్రామంలోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించి అక్కడ మరుగుదొడ్లు వాడుతున్న వారి వివరాలు సేకరించి అవసరమైతే వ్యక్తిగత మరుగుదొడ్లు అందించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి కొన్ని మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ రఘునాధ రాజు, ఎం ఆర్ సి ఎం రవి కిరణ్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు
