పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం
కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం
మార్కాపురం జిల్లా | గిద్దలూరు | జనవరి 26
పేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ అని, దాతల సహాయం ఎప్పటికీ మరువలేనిదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, సంఘసేవకులు బి.ఎస్. నారాయణరెడ్డి పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పండితులు అందజేశారు.
గత సంవత్సరం 2025లో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈ సంవత్సరం నుంచి ప్రతి సోమవారం నిరంతరంగా అన్నదానం చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
కాశినాయన దర్శనానికి వచ్చే భక్తులు, సాధువులు, సన్యాసులు, పేదలు, కడుపేదలు, ఆసరా లేని అవ్వ–తాతలకు భోజన సదుపాయం కల్పించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి కలసపాడు మండలం కాలువపల్లె గ్రామానికి చెందిన ముత్తుముల రాజేశ్వరరెడ్డి, ఆయన ధర్మపత్ని ముత్తుముల మహాలక్ష్మి, కుమారుడు ముత్తుముల రాజశేఖర్ రెడ్డి–లావణ్య దంపతులు దాతలుగా సహకారం అందించారు.
దాతలను శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన అన్నవితరణ సేవాశ్రమం కమిటీ సభ్యులు కాశినాయన పటం, శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
కాశినాయన ఆశ్రమం అభివృద్ధికి విశ్రాంత గురువులు, విశ్రాంత ఉద్యోగులు తమ వంతు సహకారం ఎప్పటికీ కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముక్తకంఠంతో తెలిపారు.
ఈ కార్యక్రమంలో
విశ్రాంత లెక్చరర్ వడ్డీ వీరారెడ్డి, కాశినాయన భక్తురాలు నరసమ్మ, టీ కొట్టు నారాయణమ్మ, చిల్లర దుకాణం యజమానురాలు లక్ష్మీదేవి, విశ్రాంత సూపర్డెంట్ పాలుగుల్ల కాశిరెడ్డి, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వర్లు, విశ్రాంత సైనికుడు లింగారెడ్డి, విశ్రాంత సర్వేయర్ రెడ్డి మల్లారెడ్డి, హోమియోపతి వైద్యుడు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాశినాయన సేవాశ్రమం తరఫున కార్యక్రమానికి సహకరించిన దాతలు, విశ్రాంత గురువులు, విశ్రాంత ఉద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
