పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆగస్టు 10
బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం విప్ మానవతావాది, ఆపద్బాంధవుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద, నిరుపేదలకు ఆహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్య అతిథులుగా టౌన్ సీఐ అతిధి ప్రసాద్, ఎస్ఐ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.
సేవా సమితి సభ్యులతో కలిసి పోలీసు అధికారులు స్వయంగా అన్నదానం నిర్వహించారు. బొలిశెట్టి శ్రీనివాస్ సామాజిక సేవకు ఇచ్చే ప్రాధాన్యం, ప్రజల పట్ల ఆయన చూపే మమకారం ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది. ప్రతి ఏడాది ఆయన జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జి, అధ్యక్షులు లింగం శీను, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, పపోప్పుల త్రినాధ్, రావు రమేష్, ప్రధాన కార్యదర్శులు రౌతు సోమరాజు, కేశవభట్ల విజయ్, కార్యదర్శి దుత్త యువరామ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులంతా ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
