తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా, ఆగస్టు 15:
తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.
కార్యక్రమంలో రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు.
మహిళల రవాణా భద్రత కోసం కీలక నిర్ణయం
రానున్న 4 సంవత్సరాలలో రూ.3384 కోట్లు ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి తెలిపారు.
ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ మహిళల కోసం ఉచిత పసుపు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.
ఆటో కార్మికులకు నష్టం రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రతిపక్షంపై విమర్శలు
“బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ అన్నవాళ్లు నేడు రోడ్లపై తిరగలేని పరిస్థితి. వాళ్లు ‘వై నాట్ కుప్పం’ అంటుంటే, మేం ‘వై నాట్ పులివెందుల’ అంటున్నాం. సొంతింట్లో గెలవలేని పరిస్థితి వాళ్లది” అని తీవ్రంగా విమర్శించారు
మౌలిక వసతుల హామీలు
ఈ ఏడాది చివరినాటికి సూపర్ సిక్స్ పథకం ప్రారంభం.
బాదంపూడి రహదారి పనులు వర్షాలు తగ్గిన వెంటనే మొదలు.
ప్రత్తిపాడు రోడ్డుకు రూ.7 కోట్లు మంజూరు అయ్యాయి.
ప్రజల స్పందన
ఈ పథకాన్ని ప్రజలు, స్థానిక నాయకులు స్వాగతించారు. మహిళలకు ప్రయాణ సౌకర్యం పెరుగుతుందని, రవాణా ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
