పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అల్లంపురం:
పెంటపాడు మండలం అల్లంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకొని, విభాగాలను, పరికరాలను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ఉచితంగా ఇంత పెద్ద స్థాయిలో హాస్పిటల్ నడపడం నిజంగా గొప్ప విషయం. ట్రస్ట్ సేవలను చూసి స్ఫూర్తి పొందుతూ మరింత మంది సేవా దృక్పథంతో ముందుకు రావాలి” అని అభినందించారు. అనంతరం రోగులకు పళ్ళు పంపిణీ చేసి, చిన్నారులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. దివ్యాంగులు అందించిన పూలను స్వీకరించి వారిని సంతోషపరిచారు.
అంతకుముందు జాతీయ రహదారికి ఆనుకుని ట్రస్ట్ కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల స్థలాన్ని పరిశీలించి, అక్కడ నూతన హాస్పిటల్ నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు కొలనువాడ పెద్ద కృష్ణంరాజు, కె.వి. రాజు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసిల్దార్ టి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
