Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన

తాడేపల్లిగూడెం ఉపాధ్యాయుల నిరసన – తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పణ

తాడేపల్లిగూడెం   సెప్టెంబర్ 12:
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన వారం రెండవ రోజు కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ –

పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు బత్యాలు వెంటనే విడుదల చేయాలని

12వ పిఆర్సి కమిషన్ తక్షణమే ప్రకటించాలని

మధ్యంతర భృతి 30% ప్రకటించాలని

EHS పరిమితిని 25 లక్షలకు పెంచాలని

ఉపాధ్యాయులపై ఉండే యాప్‌లు, అసైన్మెంట్ బుక్‌లెట్లు వంటి అదనపు పనులు రద్దు చేసి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లతో కూడిన మెమోరాండంను ఉపాధ్యాయ నాయకులు తాడేపల్లిగూడెం డిప్యూటీ తహసీల్దార్ శ్రీ A. కాళీకృష్ణ గారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి. నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు డి. ఝాన్సీ విజయకుమారి, సహాయక కార్యదర్శి లంకా రాజు, పట్టణ అధ్యక్షులు కె. రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎం. నాగరాట్నాలు, మండల ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, మండల అధ్యక్షులు ఎస్. శ్రీనివాసరావు, నాయకులు ఎం. పుష్పరాజు, ఎం. చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.ml

Related posts

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Arnews Telugu

తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం

Arnews Telugu

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu

టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్

Arnews Telugu