మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన
మాణిక్యాలరావు విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించాను. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ (RSS) గా, భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలు అందించిన మాణిక్యాలరావుతో తనకి 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన కూటమి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను బిజెపి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మాణిక్యరావు గెలుపు కోసం కృషి చేశానని, ఆయన మంత్రిగా అయితే తాను మంత్రిగా అయినట్లే అని భావన ఉండేది అన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేము అని ఆయన సేవలు, నిబద్ధత అందరికీ ఆదర్శనీయం అన్నారు. మాణిక్యాలరావు గారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
