Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లారాజకీయం

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

శతాబ్దకాలంపైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారీ జాతర 2025 – 26 లో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి సోమవారం తెల్లవారుజామున  హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. హోం మంత్రి అనితకు మంగళ వాయిద్యాలతో, ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన జాతర కమిటీ నిర్వాహకులు వంకీనేనీ భాను ప్రకాష్ మరియు జాతర కమిటీ నిర్వాహకులు.జాతర సందర్భంగా మేడలలో కొలువుదీరిన శ్రీ కొర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకునీ అమ్మవార్లకు సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం హోం మంత్రి అనితకు అమ్మవారి చీరను కానుకగా సమర్పించి తీర్థప్రసాదాలు అందజేసిన ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ మరియు జాతర కమిటీ నిర్వాహకులు.హోమ్ మంత్రి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు – బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సిఐ సత్యనారాయణ, కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి చంటి ,ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి సారథి సహా పలువురు ప్రజా ప్రతినిధులు.

Related posts

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu

“తాడేపల్లిగూడెంలో ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చీరలు, స్వీట్లు పంపిణీ”

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జన సేన తీర్థం పుచ్చుకున్నా వైసిపి నేత తెన్నేటి జగ్జీవన్

Arnews Telugu

డిసెంబర్ 13న తాడేపల్లిగూడెంలో జాతీయ లోక్ అదాలత్: కక్షిదారులకు వేగవంతమైన న్యాయ పరిష్కారాలకు అవకాశం

Arnews Telugu