డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో పిజీ మరియు పి.హెచ్.డి కోర్సుల్లో 2025-26 సంవత్సరమునకు ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది అని రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు. డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ ఉద్యాన కళాశాల ప్రవేశము కొరకు ఇంతకు ముందు నమోదు చేసుకున్న దరఖాస్తు దారులకు ది. 17-12-2025 న పిజి కోర్సులకు మరియు 18-12-2025 తేదీన పి.హెచ్.డి కోర్సులకు మాన్యూవల్ గా కౌన్సెలింగ్ ను డా.వై. ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాల, వెంకటరామన్నగూడెం నందు కౌన్సెలింగ్ కి ఏర్పాటు చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు స్వయంగా తగిన ధృవపత్రాలతో వచ్చి కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సిందిగా ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు. కౌన్సెలింగ్ లో సీట్ పొందిన వారు వెంటనే వారికి కేటాయించిన ఆయా కళాశాలల్లో చేరవలసి ఉంటుందని తెలియజేశారు. ఇతర వివరములకు https://drysthu.ap.gov.in/ చూడగలరు మరింత సమాచారం కోసం ఈ నంబర్లకు 8008263212 మరియు 7382633648. సంప్రదించాలి అని కోరారు.
previous post
