Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్ నగర ప్రజలకు, ప్రత్యేకంగా వాట్సాప్ వినియోగదారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు.వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?” అంటూ ఏదైనా సందేశం వస్తే అది ఎవరినుంచి వచ్చినా సరే ఏ పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని ఆయన స్పష్టం చేశారు.సాధారణంగా మనకు తెలిసిన వారి పేరు, DP కనిపిస్తే నమ్మేసే మనస్తత్వాన్ని దొంగలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ తరహా లింకులు “ఘోస్ట్ పేయిరింగ్” స్కామ్ భాగమని సజ్జనార్ వివరించారు.లింక్‌ను ఓపెన్ చేస్తే నకిలీ WhatsApp Web లాగిన్ పేజీ తెరుచుకుంటుంది. అక్కడ వివరాలు ఎంటర్ చేస్తే అకౌంట్ హ్యాకర్లు చేతుల్లో పడిపోతుంది. తర్వాత ఆ హ్యాకర్లు యూజర్ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపిస్తూ డబ్బు దోచుకునే మోసాలకు పాల్పడతారు.

 

సజ్జనార్ కీలక సూచనలు:

 

తెలియని లేదా సందేహాస్పద లింకులు ఎప్పుడూ క్లిక్ చేయవద్దు

తెలిసిన వారినుంచి వచ్చినా కూడా ముందుగా కాల్ లేదా వెరిఫికేషన్ చేసుకోవాలి

ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్‌కు సమాచారమివ్వాలి

స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగినకొద్దీ ఇలాంటి మోసాలు మరింత చాకచక్యంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

డిజిటల్ భద్రత ఇప్పుడు వ్యక్తిగత భద్రతంతే కీలకమయింది చిన్న అజాగ్రత్త పెద్ద నష్టానికి దారి తీస్తుందని సజ్జనార్ హెచ్చరికలు గుర్తు చేస్తున్నాయి.

Related posts

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu

H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Arnews Telugu

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..!?

Arnews Telugu