కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన
కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ కు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.
▪️ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న తిరుమణి శ్రీ పూజను పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా నియమించారు.
▪️ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్డర్ కు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.
▪️ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించారు.
▪️ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా బాధ్యతలు అప్పగించారు.
▪️ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్రాజును మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
