21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు
పెంటపాడు జనవరి 10
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో 21 రోజులపాటు జరిగిన మల్లమ్మ జాతర మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిసాయి ఆఖరి రోజు బ్రాహ్మణ పండితులచే చండీయాగం వేద ఉచ్చరణలతో నిర్వహించారు సాయంత్రం గ్రామంలో బలిచేట కార్యక్రమం చేశారు ముగింపు జాతర మహోత్సవాల్లో జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలు అత్యంత ఆనందదాయకంగా జరిగాయని అమ్మవారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండి పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు
