Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది.

వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం స రికాదంది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వ సూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్త్తి బకాయి జరిమానాలను వసూలు చేయడానికి పోలీసులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం పోలీసు లు ఏదయినా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగిన ప్రక్రియను అనుసరించాలని తెలిపింది. పి టిషనర్ తరుపున న్యాయవాది విజయ్ గోపాల్ వా దనలు వినిపించారు. పిటిషనర్‌కు ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు రూ.1,235 జరిమానా విధించార ని, అయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధిష్టమయి న ఆధారాలు పేర్కొనకపోవడంతో చలాన్ చట్టపరంగా చెల్లదని న్యాయవాది వాదించారు. మోటా రు వాహనాల చట్టం 1988 ప్రకారం, ట్రిపుల్ రై డింగ్‌కు జరిమానా రూ.100 నుండి రూ.300 మ ధ్య ఉంటుందని కోర్టుకు

 

తెలిపారు. మోటారు వాహనాల చట్టానికి 2019లో జరిగిన సవరణలను రాష్ట్రం ఆమోదించనందు వల్ల అధిక జరిమానాలు విధించలేరని న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుళ్లారు. దీంతో పాటు పోలీస్ సిబ్బంది ప్రభుత్వం దృవీకరించిన నిఘా కెమెరాలకు బదులుగా వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, హ్యాండ్ కెమెరాలు, ఇతర ధృవీకరించబడని పరికరాలను జరిమానాలకు ఉపయోగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి చలాన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా చూడాలని చెప్పారు. ఈ క్రమంలో పెండింగ్ చలాన్లు వసూలుకు బలవంతం చేయవద్దని కోర్టు చెప్పడం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత సంవత్సరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల చలాన్లు విధించారు. ఇందులో వాహనాలను ఆపి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు 10,27,335 ఉండగా, ఇ చలాన్లు 25,93,152 ఉన్నాయి. ఈ రెండు రకాల చలాన్ల మొత్తం విలువ రూ. 239.37 కోట్లు అని వార్షిక నివేదికలో వెల్లడయింది.

Related posts

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు

Arnews Telugu

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu