తాడేపల్లిగూడెం, ఆగస్టు 3:
షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జనతా డాక్టర్ ఎల్ ఎస్ వి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కళ్ళు, కిడ్నీలు, నరాలు వంటి అవయవాలు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యధిక కేసుల్లో మొదట కంటి చూపు తగ్గడం ద్వారా లక్షణాలు బయటపడతాయని తెలిపారు.
అందువల్ల తొలినాళ్లలోనే షుగర్‌ను గుర్తించి, నియంత్రించుకోవడం అత్యంత అవసరమని డాక్టర్ సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 70 మంది పేషెంట్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు
