Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

తాడేపల్లిగూడెం, ఆగస్టు 20:

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతిభావంతులు పాల్గొననున్నారని యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరిబండి రామకృష్ణ తెలిపారు.

బుధవారం అలంపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ –
“మునుపటి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన యోగా క్రీడాకారులు ఈ సారి కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన వారికి జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ –

క్రీడాకారుల కోసం నివాసం, ఆహారం, భద్రత, మెడికల్ సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేశామని

స్థానిక ప్రజలు, యాజమాన్యం కూడా పోటీల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని

విద్యార్థులు యోగాసనాలను అభ్యసించడం వలన శారీరక – మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన వెంట త్రిమూర్తులు కూడా పాల్గొన్నారు.
పోటీల్లో విభిన్న వయసు విభాగాలు (అబ్బాయిలు – అమ్మాయిలు వేర్వేరుగా) ఉంటాయని, ప్రతిభ కనబరచిన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

Related posts

భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

Arnews Telugu

గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా

Arnews Telugu

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

Arnews Telugu

నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి

Arnews Telugu