పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం :
పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు
