తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం?
తాడేపల్లిగూడెం రాజకీయాల్లో మరోసారి అలజడి.
మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ఏ దిశలో కొనసాగుతుందనే అంశంపై గట్టి చర్చ నడుస్తోంది.
బీజేపీ ప్రయత్నం – తిరస్కరణ
కొద్ది నెలల క్రితం కొట్టు సత్యనారాయణ వైసీపీని వదిలి బీజేపీలో చేరాలని ప్రయత్నించినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
అయితే అక్కడి బీజేపీ అధిష్టానం ఆయనను పూర్తిగా తిరస్కరించింది.
వారికి కొట్టు మీద నమ్మకం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ పరిణామంతో గత్యంతరం లేక మళ్లీ వైసీపీలోనే కొనసాగడం…
ఇది ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది.
కార్యకర్తల అసంతృప్తి
“బీజేపీకి పనికిరాని వ్యక్తిని మనం ఎందుకు భరిస్తాం?” అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ కారణంగానే పార్టీలో అంతర్గత చర్చలు, విభేదాలు మరింత ఎక్కువయ్యాయి.
జనసేన & బీజేపీ నుంచి మునగరసం
అదే సమయంలో ప్రతిపక్షం ఆయన్ను వదిలిపెట్టడం లేదు.
జనసేన నాయకులు ఆయనపై వరుస ఆరోపణలు చేస్తూ *“అవినీతి చిహ్నం”*గా కొట్టును ఎండగడుతున్నారు.
జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు కూడా “అవినీతికి మారుపేరు కొట్టు” అంటూ బహిరంగంగా విమర్శించారు.
ఓటమి తర్వాత ఖాళీ దుకాణం?
2024 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కొట్టు తన ఉనికిని నిలుపుకోవడం కష్టమైపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లిపోతుండటంతో “కొట్టు దుకాణం ఖాళీ అవుతుంది” అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ వర్గాలలోగుసగుసలు
కొట్టు బంధువులే జగన్‌ను కలసి “ఇక్కడ మార్పు తప్పనిసరి, లేకుంటే పార్టీ మనుగడ ఉండదు” అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ప్రజల్లోనూ ఒకే మాట:
“ప్రజలతో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే, ఆర్థిక సహాయం చేసే, జగన్‌కు నమ్మకస్తుడైన నాయకుడే నియోజకవర్గ పగ్గాలు చేపట్టాలి” అని.
మొత్తానికి…
బీజేపీకి పనికిరాక తిరస్కరించబడ్డ కొట్టు,
వైసీపీలో ఉండగానే కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి…ఈ
రెండూ కలిసి ఇప్పుడు తాడేపల్లిగూడెం వైసీపీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేశాయి.
అసలు ఇక్కడ నిజంగానే మార్పు దిశగా పగ్గాలు కదలబోతున్నాయా?
లేదా కొట్టు మరోసారి తాను రాజకీయాలలో బతికే మార్గాన్ని కనుక్కుంటారా?
గూడెం రాజకీయాల్లో ఈ ప్రశ్నే ఇప్పుడు హాట్ టాపిక్
