బీజేపీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో
భారతీయ జనతా పార్టీ
OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు జామి ప్రవీణ్‌కు నియామక పత్రాన్ని అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తూ, OBC వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని జామి ప్రవీణ్ ఈ సందర్భంగా తెలిపారు.
బీజేపీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ విధానాలను గ్రామ స్థాయి వరకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ నియామకంతో జిల్లాలో OBC మోర్చా కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జామి ప్రవీణ్‌కు శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
previous post
next post
