యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, ఆగస్టు 2:
యువత పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి, స్వయం సమృద్ధి తోపాటు మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.
తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురంలో నూతనంగా నిర్మించిన “అపర్ణ ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్లాంట్” ను ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఉలవల బాబ్జి మాట్లాడుతూ యువత పారిశ్రామిక రంగంలో ప్రగతిపథం వైపు అడుగులు వేయాలని సూచించారు.
నాణ్యమైన మంచినీరు అందరికీ అందించే దిశగా ఈ ప్లాంట్ సేవలు అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి సూచించారు. అలాగే, ప్లాంట్ నిర్వాహకుడు కాకర్ల కిట్టును అభినందించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ఆరుగొలను సొసైటీ మాజీ చైర్మన్ రెడ్డి రాము, మాజీ ఎంపీపీ కాకర్ల రమాదేవి ప్రభాకర్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
