రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో
తాడేపల్లిగూడెం, ఆగస్టు 20:
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతిభావంతులు పాల్గొననున్నారని యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరిబండి రామకృష్ణ తెలిపారు.
బుధవారం అలంపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ –
“మునుపటి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన యోగా క్రీడాకారులు ఈ సారి కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన వారికి జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది” అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ –
క్రీడాకారుల కోసం నివాసం, ఆహారం, భద్రత, మెడికల్ సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేశామని
స్థానిక ప్రజలు, యాజమాన్యం కూడా పోటీల నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని
విద్యార్థులు యోగాసనాలను అభ్యసించడం వలన శారీరక – మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట త్రిమూర్తులు కూడా పాల్గొన్నారు.
పోటీల్లో విభిన్న వయసు విభాగాలు (అబ్బాయిలు – అమ్మాయిలు వేర్వేరుగా) ఉంటాయని, ప్రతిభ కనబరచిన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.
