తాడేపల్లిగూడెం పట్టణం మూడో వార్డు వికర్స్ కాలనీలో మజిదేనూర్ మస్జిదుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా సాహెబ్ శుక్రవారం నమాజు ఆచరణకి రావడం జరిగింది ఈ సందర్భంగా మీరా సాహెబ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో హామీలో భాగంగా హజ్ యాత్రలకు లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తానని మాట ఇవ్వడం మాటనే నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అని తెలపడం మరి అదే విధంగా హజ్ విషయాల మీద హాజీ వెళ్లే యాత్రికులకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఈ సంవత్సరం యాత్రికులకు విజయవాడ విమానాశ్రయం నుండి ప్రయాణం చేసే సౌలభ్యని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది . అదేవిధంగా నాకు తెలుగుదేశం పార్టీలో అంత మంచి అవకాశాన్ని కల్పించడానికి కృషి చేసిన గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మజిదే నూర్ అధ్యక్షులు షేక్ ముజుబుర్రహ్మాన్ కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ గారు మాట్లాడుతూ షేక్ మీరా సాహెబ్ గారు గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కృషికి అదేవిధంగా చాలా నియోజకవర్గాలకు ఆయన పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ విజయానికి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడే మంచి ఉన్నతమైన పదవి దక్కించుకోవడమైనదని తెలిపారు తెలుగుదేశం పార్టీ లో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని దీనికి ఉదాహరణ మీరా గారిని తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు షేక్ లాలు సులేమాన్ అస్లాం ఆరిఫ్ సాలెహ షేక్ అమీనా పి ఎం పి డాక్టర్ సూర్య హాల్ మరియు మసీదు పెద్దలు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
previous post
next post
