Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

ఎపి మెడికల్ కౌన్సిల్ లో అవకాశం కల్పించండి

*ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

భీమవరం ఫిబ్రవరి 2

ఈనెల 9 తేదీ
జరగనున్న ఎపి మెడికల్ కౌన్సిల్ లో మెంబర్ గా అవకాశం కల్పించాలని ప్రముఖ ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ కెవైసి. రంగయ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం రంగయ్య పశ్చిమగోదావరి జిల్లా వైద్యులకు తనకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గతంలో 2006లో ఎపి మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయని ప్రస్తుతం ఈనెల 9న జరుగుతున్నాయని, ఈ ఎన్నికలలో 13 పోస్టులకు గాను 84 మంది పోటీ పడుతున్నారన్నారు. అందులో తను పోటీ చేస్తున్ననాని తను ప్రభుత్వ మెడికల్ కాలేజిలో ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నానని డాక్టర్స్ సంఘాల్లో కూడా పనిచేశానన్నారు. అవకాశం కల్పిస్తే ప్రభుత్వ వైద్యులు, ప్రయివేట్ వైద్యుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తనను గెలిపించి అవకాశం కల్పించాలనర్నారు.
సేవ చేసుకునే అవకాశం అందరికీ రాదని కొంతమందికే ఆ అవకాశం ఉంటుందని దయచేసి
అలాంటి అవకాశన్నీ తనకు కల్పించాలని రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ల వైద్యులకు ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్, ఏపీఎంసీ అన్నికల అభ్యర్థి డా.వై కె సీ రంగయ్య విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఓటింగ్కు ప్రాధాన్యతను పొందడానికి, దయచేసి మీ మొబైల్ ఇ-వెరిఫికేషన్ను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రతి రిజిస్టర్డ్ వైద్యులు ఇ-వెరిఫికేషన్ను పూర్తి చేసుకొని ఏపీఎంసి ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో సులభంగా పాల్గొని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు 2016-2018 డాక్టర్ అప్పారావు పథకానికి ఐఎంఏ కార్యదర్శి, ఐఎంఏ సంయుక్త కార్యదర్శి, ఐఎంఏ కోశాధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ నుండి ఏబీసీడీ-1 అవార్డు 2016 (ఉత్తమ నేర పరిశోధన కోసం )అవార్డు పొందానని గుర్తు చేశారు. ఏపీఎంసీ ఇ-ఓటింగ్ లో మీ అమూల్యమైన ఓటును తనుకు వేసి, మీకు సేవ చేసుకుని అవకాశం కల్పించాలని డాక్టర్ వై.కె.సి. రంగయ్య అందరికీ విజ్ఞప్తి చేశారు.

Related posts

శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం

Arnews Telugu

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu

H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Arnews Telugu

కూటమి పాలన లోనే రాష్ట్ర అభివృద్ధి…మాజీ ఎంపీ మాగంటి బాబు

Arnews Telugu

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం

Arnews Telugu

కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు

Arnews Telugu