తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 7 :
తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆదిత్య స్కూల్ 8వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతి రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి లోటస్ విద్యాసంస్థల అధినేత బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి. విశ్వనాధ్, పట్టణ సీఐ బి. రవికుమార్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. అనంతరం అతిథులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోలా వాసుదేవ్, వైస్ ప్రిన్సిపల్ ఎస్.ఎన్.ఎస్. అరుణ, తెదేపా 11వ వార్డు ఇంచార్జ్ ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
previous post
