Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలుతాడేపల్లిగూడెం

ప్రతి విద్యార్థి దేశం పట్ల దేశభక్తితో మెలగాలి..ఎమ్మెల్యే బొలిశెట్టి

తల్లిదండ్రులు తమ పిల్లలను దేశభక్తితో పెంచాలని విద్యార్థులు భారతదేశ పౌరులుగా దేశభక్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.పెంటపాడు మండలం టి బి ఆర్ సైనిక్ స్కూల్ 54 వ కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సైనిక్ స్కూలు విద్యార్థులని ఉద్దేశించి సైనికుల యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయభ్రాంతులకు గురవుతున్న శత్రు దేశాలకు భారతదేశ సైన్యం ఎదురు నిలుస్తుందని దీనికి కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తిరుగులేని శక్తిగా నిలిచారని అన్నారు. టి బి ఆర్ వంటి సైనిక్ స్కూల్ ద్వారా భారత సైన్యంలో సేవలు అందించేందుకు ఎన్నికైన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. దేశం లోపల ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే దేశం నలువైపులా సైన్యం కాపలా ఉండాలని అన్నారు. అంతటి త్యాగం చేసిన సైన్యంలో చేరి దేశభక్తిని చాటాలని అన్నారు. నియోజకవర్గంలో మిలటరీ మాధవరం గ్రామం నుండి అనేకమంది సైన్యంలో చేరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా తాను గర్వపడుతున్నానని అన్నారు. అత్యున్నత స్థాయి అధికారికి దక్కే గౌరవాన్ని దేశ సైనికునికి ప్రతి పౌరుడు ఇవ్వాలని తెలిపారు.

Related posts

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి

Arnews Telugu

తాడేపల్లిగూడెం రేషన్ బియ్యం పట్టివేత

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu

ఆహా …ఏమి”టీ” గురు

Arnews Telugu

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకపోవడం బాధాకరం – దండగ సర్పంచ్ పిల్లా: రాంబాబు

Arnews Telugu

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన

Arnews Telugu