Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

పశ్చిమగోదావరి జిల్లా, ప్రతినిధి ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మహిళలు అక్రమ రవాణా పైన అవగాహనా కార్యక్రమం తాడేపల్లెగూడెం ఎంపిడిఓ భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంపిడిఓ చంద్రశేఖర్ మరియు డిప్యూటీ ఎంపీడీఓ వాణి  మాట్లాడుతూ ఈ అక్రమ రవాణా అనేది ప్రపంచం లోనే అతి పెద్ద నేరం అన్నారు. ప్రతి రోజు ఎంతో మంది బాలికలు, మహిళలు దీనికి గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరు దీని పైన అవగాహనా కలిగి ఉండాలని తెలిపారు, ముక్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల ద్వారా మోసం చేసి విదేశాలకు అమ్ముతున్నారన్నారు. ప్రతి మహిళ తమ పరిధిలో ఉన్న వారికీ అవగాహనా కల్పించి రక్షించాలని అన్నారు. ఈ అక్రమ రవాణాకు లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రజ్వల స్వచ్చంద సంస్థ గత 29 సంవత్సరాలుగా పద్మ డాక్టర్. సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో సంబంధిత మహిళా శిషు సంక్షేమ శాఖ, పోలీస్, విద్యా శాఖ, న్యాయ శాఖల సమన్వయముతో ఇప్పటి వరకు 30500 మంది అమ్మాయిలను మహిళలను కాపాడి వారికీ కల్పించడం పునరావాసం జరిగిందని తెలిపారు. ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలీరాజ్ మాట్లాడుతూ సమాజం లో జరుగుతున్న అక్రమ రవాణా ను అరికట్టడం లో అందరు భాగస్వామ్యం కావాలి అని, ప్రతి గ్రామలలో కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా అందరు అప్రమతంగా ఉంటారని అన్నారు. అక్రమ రవాణాకు గురి అయినా పిల్లలను శ్రమ దోపిడీ, అవయవాల దోపిడీ లైంగిక దోపిడీకి అమ్ముతున్నారని తెలిపారు. నేటి కాలంలో యువత మొబైల్ ఇంటర్నెట్ ద్వారా సైబర్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారని తెలిపారు. అనుమానస్పద వ్యక్తుల నుండి మెసేజ్ గాని కాల్స్ గాని వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని గురి అయినా సందర్భాలలో 1930,181,1098,100 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలి అని అన్నారు.మహిళ కు ఉన్న చట్టాలు ను ఎలా ఉపయోగించాలి అని టీచర్లకి లఘు చిత్రల ద్వారా అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ ఎంపీడీఓ వాణి గారు, ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్లు అనిల్ కుమార్ మరియు మిథాలిరాజ్, సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu

తాడేపల్లిగూడెం: 64 ఏళ్ల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత

Arnews Telugu

నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి

Arnews Telugu

ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

ఘనంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య స్కూల్ ఎనిమిదో వార్షికోత్సవం

Arnews Telugu