పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాధపురం గ్రామంలో ‘మా భూమి – మా హక్కు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పీ.జీ.ఆర్.ఎస్ (PGRS) కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ…
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గత ప్రభుత్వంలో జరిగిన భూ సర్వే లోపాలు, సరిహద్దు వివాదాలను సరిదిద్దుతూ భూముల హక్కులను నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం పాసుపుస్తకాలపై ఫోటోలు పెట్టిన పరిస్థితులను పూర్తిగా మార్చి, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
జగన్నాధపురం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని, అప్పారావుపేట వరకు రహదారి అభివృద్ధితో పాటు కోటి రూపాయల వ్యయంతో నీటి ట్యాంక్ మరియు పైప్లైన్ పనులను ప్రజలకు అంకితం చేశామని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే…
“అన్నదాత సుఖీభవ”, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా ఈ ఒక్క గ్రామానికే కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వరదల సమయంలో ముంపుకు గురయ్యే జగన్నాధపురం, మాధవరం, మారంపల్లి తదితర గ్రామాలను కాపాడేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈతకోట తాతాజీ సర్పంచ్ చంద్రిక, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు అడపా ప్రసాద్ ప్రసాద్ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి ఏంచేస్తునావు చైర్మన్అ చాపల మంగ బాయ్ధి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
