Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు

*ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు

*విద్యతోపాటు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవలు అమూల్యం

ఉంగుటూరు జనవరి 10

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు
కార్మెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 34 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా కార్మిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యతోపాటు అనేక సామాజిక కార్యక్రమాలలో ముందున్నారని కొనియాడారు ఈ స్కూలు నుండి విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని తెలిపారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ కలలను సాధించాలని పిలుపునిచ్చారు ఈనాటి విద్యార్థులే రేపటి భావిభారత దేశానికి దిక్సూచులని అన్నారు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులకు రాయితీ ఇవ్వడం , పేదలకు నిత్య అవసరాలు అందించడం, అనారోగ్యం తో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ను ఆయన అభినందించారు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీవా ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసిస్తున్నారని ఆమెను కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్య కళ కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా కార్మెల్ సంస్థ ప్రెసిడెంట్ సిస్టర్ మరియా అగస్టిన్ ,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సిస్టర్ సారూప్య , ఉప విద్యాశాఖ అధికారి రవీంద్ర భారతి చేబ్రోలు ప్రెసిడెంట్ రాందే లక్ష్మీ సునీత రాజారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Related posts

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

AR NEWS TELUGU

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

AR NEWS TELUGU

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu