27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం
తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
27వ వార్డులోని రామాలయం, స్థానిక బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, బలుసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ సభ్యులు అంజి ఆధ్వర్యంలో మహిళలకు గాజులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీనివాస్, 27వ వార్డు ప్రెసిడెంట్ నాని పాల్గొన్నారు.
అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.
