Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి

తాడేపల్లిగూడెం జనవరి 31

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుందని తాడేపల్లిగూడెం పట్టణ 18 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం తాళ్ళ ముదునూరుపాడు హరిజన పేట లోని ఎస్సి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త పిచ్చి మొక్కలును తొలగించడం కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న డ్రైన్ గుర్రపు డెక్కతో నిండిపోవడంతో ఆ డ్రైన్ తమ సొంత నిధులతో శుభ్రపరిచారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హరిజన పేటలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ శిథిలవస్థకు చేరిందని దీనిని ఆనుకొని ఎన్నో కుటుంబాలు నివసిస్తున్నాయని చాలా కాలంగా ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉందని పెరిగిన పిచ్చి మొక్కలు అక్కడ ప్రవహించే డ్రైన్ లో గుర్రపు డెక్క ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అందువలన తమ సొంత నిధులతోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణాన్ని ,డ్రైన్ ను శుభ్రపరచమని తెలిపారు అదే విధంగా వార్డులోని ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు శిథిల అవస్థలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పునః నిర్మించే విధంగా , స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ కు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు వార్డులో ఏ విధమైన ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు 18 వ వార్డు ముదునూరుపాడు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu

“తాడేపల్లిగూడెంలో ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చీరలు, స్వీట్లు పంపిణీ”

Arnews Telugu

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

Arnews Telugu

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu

శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu