“అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.
తాడేపల్లిగూడెం:
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టు ఫ్రీ రిలీజ్ చిత్రం అఖండ విజయం సాధించాలని తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున రావు బాబ్జి ఆకాంక్షించారు. అఖండ టు చిత్రం విడుదల సందర్భంగా వడ్లపట్ల దినేష్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ శ్రీ కాన్ ప్లెక్స్ థియేటర్లో అభిమానులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, వలవలబాబ్జి మాట్లాడుతూ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సినిమా ఘనంగా విడుదల కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు పెద్ద సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జనసేన యువనాయకుడు బొలిశెట్టి రాజేష్,బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
