Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల ఏరివేత ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగులు ₹6,000 పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా కొందరు ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది.

అనర్హుల తొలగింపు

🔹 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేసి దివ్యాంగ పెన్షన్ ఇస్తుంది.
🔹 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు ఇకపై ఈ పథకానికి అర్హులు కారు.
🔹 తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న దివ్యాంగులకు మాత్రం ప్రభుత్వం ₹15,000 పెన్షన్ ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు లేవని తేలితే వారికి కేవలం ₹6,000 దివ్యాంగ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది.
🔹 వృద్ధ దివ్యాంగులకు వైకల్యం లేదని తేలితే, వారిని వృద్ధాప్య పెన్షన్ కింద మార్చనుంది.

సచివాలయాల ద్వారా నోటీసులు

👉 ఈరోజు నుంచి ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది.
👉 అనర్హతగా తేలిన వారికి పెన్షన్ రద్దు ఉత్తర్వులు కూడా అందజేయబడతాయి.
👉 ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది.

అపీల్ చేసే అవకాశం

అర్హత ఉన్నప్పటికీ అనర్హతగా తేలితే, ఆ వ్యక్తులకు అపీల్ చేసుకునే అవకాశం కల్పించింది.

కొత్త సదరం కార్డులు

🔹 తనిఖీల అనంతరం నిజంగా అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త సదరం కార్డులు జారీ చేస్తుంది.
🔹 పెన్షన్ అనర్హత నోటీసు అందుకున్న వారు మరిన్ని వివరాలకు తమ గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించాలి

Related posts

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu

భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ

Arnews Telugu

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

జగన్నాధపురంలో పాసుపుస్తకాలు – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

Arnews Telugu