Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం
గణపవరం, ఏప్రిల్ 21:
గణపవరం మండలంలో దాళ్వా వరి పంట కోతలు వేగంగా కొనసాగుతున్నాయని మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్. ప్రసాద్ తెలిపారు. మండలంలోని కోమర్రు, ముయ్యరు, ముప్పర్తిపాడు, అప్పన్నపేట, పిప్పర, వల్లూరు, చిలకపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాళ్వా వరి పంట కింద మొత్తం 14,414 ఎకరాల్లో సాగు జరిగిందని, ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2,700 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో కూడా కోతలు ప్రారంభమయ్యాయని చెప్పారు.
మండలంలో సుమారు 82 కోత యంత్రాలు పనిచేస్తూ వరి కోతలను వేగవంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండి, ఎకరానికి 55 నుంచి 57 బస్తాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. అలాగే స్థానికంగా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం అమ్మాలని సూచించారు.
పచ్చి ధాన్యం అమ్మకాన్ని నివారించాలని, ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితుల్లో రెండు నుంచి మూడు రోజుల్లో ధాన్యం పూర్తిగా ఆరిపోతుందని, తేమ శాతం సుమారు 17% వరకు తగ్గుతుందని తెలిపారు.
ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే మండల వ్యవసాయ అధికారి లేదా మండల రెవెన్యూ అధికారిని సంప్రదించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌కే సిబ్బంది రవీంద్ర, రవితేజ, సన్నీ, హవేల, జాబేజ్, దీనాకుమారి తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Arnews Telugu

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu

MGNREGA కార్మికులపై భారం: ఫోటో విధానం రద్దు చేయాలని కేంద్రానికి డిమాండ్

Arnews Telugu

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

Arnews Telugu

తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు

Arnews Telugu